న్యూఢిల్లీ: ఐసీసీకి ఇది నిజంగా ఇబ్బందికర వార్తే. క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లను అరికట్టేందుకు పనిచేస్తున్న ఐసీసీ అవినీతి వ్యతిరేక యూనిట్ (ఏసీఎస్‌యూ)కు చెందిన ఉన్నతాధికారికి బుకీలతో సంబంధాలున్నాయని ఓ టీవీ చానెల్ వెల్లడించింది.
బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన టి20 ప్రపంచకప్ సందర్భంగా భారత బుకీతో ఐసీసీ ఏసీఎస్‌యూ అధికారి జరిపిన సంభాషణల ఆడియో టేపును ‘బంగ్లా ట్రిబ్యూన్’ అనే చానెల్ విడుదల చేసింది. జాగ్రత్తగా బంగ్లాదేశ్‌ను విడిచి వెళ్లమని బుకీతో అధికారి చెబుతున్నట్టు ఆ టేపుల్లో ఉంది. అంతేకాకుండా టోర్నీ సందర్భంగా ఆ బుకీని ఢాకా పోలీసులు అరెస్ట్ చేస్తే.. అతడు తన ఇన్‌ఫార్మర్ అని ఈ అధికారే తప్పించాడని పేర్కొంది. ఈ ఆరోపణలపై ఐసీసీ ఇప్పటిదాకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.
బుకీతో ఏసీఎస్‌యూ అధికారికి లింకు!
Published Wed, May 21 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM
Advertisement