దుబాయ్: ‘యూనిసెఫ్’తో తమ భాగస్వామ్యాన్ని మరింత కాలం కొనసాగించనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. మహిళలు, బాలికల సాధికారికత కోసం వచ్చే ఏడాది జరిగే మహిళల టి20 ప్రపంచ కప్ టోర్నీ వరకు యూనిసెఫ్‌తో తాము కొనసాగుతామని ఐసీసీ స్పష్టం చేసింది. దీంతో క్రికెట్ ఆడే దేశాల్లో బాలల హక్కుల కోసం యూనిసెఫ్ చేపడుతోన్న కార్యక్రమాలకు నిధుల సేకరణలో ఐసీసీ సహాయపడినట్లవుతుంది.
ఐసీసీ క్రికెట్ ఈవెంట్‌ల ద్వారా సమకూర్చిన నిధుల్ని బాలికలకు క్రికెట్ క్రీడ నేర్పించేందుకు, మౌలిక సదుపాయాలు, శిక్షణా సిబ్బంది ఏర్పాటు వంటి తదితర కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు. తాజా వన్డే ప్రపంచ కప్–2019 సమయంలో సేకరించిన నిధులను కూడా అఫ్గానిస్తాన్‌లో బాలికల క్రికెట్ ప్రాజెక్ట్ కోసం వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు కూడా పాలుపంచుకోవచ్చని ఐసీసీ తెలిపింది. టిక్కెట్ల కొనుగోలు ద్వారా వారు ఇందులో భాగస్వాములు కావచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment