డెర్బీ: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో బుధవారం న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఎడతెరిపిలేని భారీ వర్షంతో ఇక్కడి కౌంటీ గ్రౌండ్ చిత్తడిగా మారిపోయింది. దీంతో కనీసం టాస్ వేసే పరిస్థితి కూడా లేకపోయింది. ఇక చేసేదేమి లేక ఫీల్డు అంపైర్లు లాంగ్టన్ రూసెర్, పాల్ విల్సన్ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.