
మన మహిళలు వరల్డ్ కప్ గెలిస్తే..
న్యూఢిల్లీ:ఇంగ్లండ్ లో జరుగుతున్న మహిళా వన్డే వరల్డ్ కప్ను భారత్ గెలిస్తే మాత్రం కచ్చితంగా కొత్త శకం ఆరంభం కావడం ఖాయమని టీమిండియా మెన్స్ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మన మహిళా క్రికెటర్ల ఆట తీరు చూస్తుంటే వరల్డ్ కప్ గెలవడం ఏమాత్రం కష్టం కాదని రైనా ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
భారత మహిళా జట్టు జైత్రయాత్రను తాను ఎంతగానో ఆస్వాదిస్తున్నట్లు తెలిపిన రైనా.. ప్రధానంగా ఈ క్రెడిట్ అంతా కెప్టెన్ మిథాలీ రాజ్కే చెందుతుందని కొనియాడాడు. ఇక్కడ ఆమె వ్యక్తిగత ప్రదర్శనే కాకుండా జట్టులోని మిగతా క్రికెటర్లను కూడా చక్కగా వినియోగించుకునే తీరు బాగుందని రైనా అన్నాడు. భారత మహిళలు పాకిస్తాన్ పై సాధించిన విజయం చాలా స్పెషల్ అయితే, వరల్డ్ కప్ గెలిచి మరొక స్పెషల్ తో తిరిగి రావాలని రైనా ఆకాంక్షించాడు.