న్యూఢిల్లీ: మూడో టెస్టులో తొలి రోజు భారత బౌలర్ల ప్రదర్శన బాగుందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కితాబిచ్చారు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఇదే ఉత్తమ ప్రదర్శనన్నారు. అయితే నాణ్యమైన బౌలింగ్ ఆల్‌రౌండర్ లేకపోవడం రెండో రోజు ఆటను దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. ‘బౌలర్లు తమ సత్తా చూపెట్టారు. గతంతో పోలిస్తే ఇప్పుడు గాడిలో పడ్డారు. అయితే ఆసీస్ లోయర్ ఆర్డర్‌ను అవుట్ చేయడంలో మనం విఫలమవుతున్నాం. వీలైనంత త్వరగా ఆ పని ముగించాలి. రెండో రోజు ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. హాడిన్, జాన్సన్‌లు సెంచరీ చేసిన రికార్డులు ఉన్నాయి.
స్మిత్ అద్భుతంగా ఆడుతున్నాడు. కాబట్టి ఆసీస్ 400 దాటొచ్చు’ అని సన్నీ పేర్కొన్నారు. ధోని నలుగురు బౌలర్ల వ్యూహాంపై మాట్లాడుతూ... బ్రిస్బేన్‌లో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాట్స్‌మెన్ అవుటైన తీరును దృష్టిలో పెట్టుకుని అలా చేసి ఉండొచ్చన్నారు. రైనాను కాదని లోకేశ్ రాహుల్‌ను అరంగేట్రం చేయించడంలో ఎలాంటి తప్పిదం లేదన్నారు. షార్ట్ బంతులను రైనా ఆడలేడనే అపవాదును ఆస్ట్రేలియన్లు సొమ్ము చేసుకుంటారన్నారు. రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగితే బాగుంటుందన్నారు.
భారత బౌలర్లకు గవాస్కర్ ప్రశంస
Published Sat, Dec 27 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM
Advertisement