
బౌలర్లను భారత్ రక్షించుకోవాలి: అక్రమ్
ఎక్కువ మంది కోచ్‌లతో పని చేయడం వల్ల భారత బౌలర్లు నష్టపోతున్నారని పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ అభిప్రాయపడ్డారు.
ఎక్కువ మంది కోచ్‌లతో పని చేయడం వల్ల భారత బౌలర్లు నష్టపోతున్నారని పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ అభిప్రాయపడ్డారు. ‘ పలువురి కోచ్‌ల సలహాలతో బౌలర్లకు నష్టం జరుగుతుంది. ఇర్ఫాన్ ఇలాగే కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. చాలామంది ఆరంభంలో 140 కి.మీ.పైచిలుకు వేగంతో బౌలింగ్ చేస్తున్నారు. కానీ తర్వాత కోచ్‌ల వల్ల వేగం తగ్గిపోతోంది. బీసీసీఐ దృష్టిపెట్టి బౌలర్లందరికీ ఒకే కోచ్ ఉండేలా చర్యలు తీసుకుంటే మంచిది’ అని అక్రమ్ చెప్పారు.