కీలక దక్షిణాఫ్రికా సిరీస్ కి ముందే టీమిండియా కోచ్ ఎంపిక జరగ నుంది. సెప్టెంబర్ ఆఖరులో ప్రారంభం కానున్న సుదీర్ఘ సిరీస్ కి కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియ ముమ్మరం చేసినట్లు బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ టాకూర్ తెలిపారు. భారత్ దిగ్గజ ఆటగాళ్లు.. సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో ఏర్పాటు చేసిన సలహా కమిటీ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నామని వివరించారు.
ఒక వేళ.. ప్రోటీస్ తో సిరీస్ కంటే ముందు రిపోర్టు రాని పక్షంలో శ్రీలంక సిరీస్ లో ఇన్ చార్జి కోచ్ గా వ్యవహరించిన రవిశాస్త్రినే కొనసాగించే అవకాశం ఉందని తెలిపారు. మరో వైపు రవిశాస్త్రి ని పూర్తి స్ధాయి కోచ్ గా ఎంపిక చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే, డైరెక్టర్‌గా అతనిని కొనసాగిస్తూ, కోచ్‌గా మరొకరిని ఎంపిక చేసుకుంటే, అంతకంటే ఎక్కువ ఖర్చవుతుందన్నది బిసిసిఐ అధికారుల ఆలోచిస్తున్నారు. రవిశాస్త్రినే కోచ్ గా నియమిస్తే.. ఖర్చు తగ్గుతుందని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.
ఇక పాక్ తో సిరీస్ పై అనురాగ్ టాగూర్ మాట్లాడుతూ.. సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల కారణంగా.. ద్వైపాక్షిక టోర్నీ సాధ్యం కాదని స్పష్టంచేశాడు. ఇలాంటి కవ్వింపు చర్యల తర్వాత పాక్ తో సిరీస్ సాధ్యమైతుందని తాను అనుకోవడం లేదని అన్నారు. పాక్ తో క్రికెట్ ఆడాలనే ఆలోచన లేదని.. కేవలం పీసీబీ.. బీసీసీఐతో చర్చలు జరుపుతోందని తెలిపాడు.
సౌతాఫ్రికా సిరీస్ కి ముందే టీమిండియా కోచ్
Published Tue, Sep 8 2015 4:30 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM
Advertisement