
భారత్‌కు షాక్
⇒మలేసియా చేతిలో ఓటమి
⇒ఫైనల్‌పోరుకు అర్హత సాధించని టీమిండియా
ఇపో: మలేసియాలో జరుగుతున్న సుల్తాన్ అజ్లాన్‌షా హాకీ టోర్నీలో భారతజట్టుకు భంగపాటు ఎదురైంది. ఫైనల్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఆఖరి లీగ్‌మ్యాచ్‌లో మలేసియా చేతిలో 0–1తో టీమిండియా ఓటమి పాలైంది. ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించడంలో విఫలమైన భారత్‌కు ఈ మ్యాచ్‌లో నిరాశ తప్పలేదు. మరోవైపు చివరి నిమిషాల్లో గోల్ సమర్పించుకుని ఓటమిని కొని తెచ్చుకుంది.
49వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచిన ఫిత్ర్ సారి.. మలేసియా జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. తాజా ఫలితంతో ఫైనల్‌కు ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్‌లు దూసుకెళ్లాయి. ఏడు పాయింట్లతో మూడో స్థానంలో టీమిండియా నిలిచింది. దీంతో కాంస్యపతకం కోసం న్యూజిలాండ్‌తో శనివారం భారత్ తలపడనుంది.