Sultan Azlanzha hockey tournament
-
భారత్‌కు షాక్
⇒మలేసియా చేతిలో ఓటమి ⇒ఫైనల్‌పోరుకు అర్హత సాధించని టీమిండియా ఇపో: మలేసియాలో జరుగుతున్న సుల్తాన్ అజ్లాన్‌షా హాకీ టోర్నీలో భారతజట్టుకు భంగపాటు ఎదురైంది. ఫైనల్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఆఖరి లీగ్‌మ్యాచ్‌లో మలేసియా చేతిలో 0–1తో టీమిండియా ఓటమి పాలైంది. ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించడంలో విఫలమైన భారత్‌కు ఈ మ్యాచ్‌లో నిరాశ తప్పలేదు. మరోవైపు చివరి నిమిషాల్లో గోల్ సమర్పించుకుని ఓటమిని కొని తెచ్చుకుంది. 49వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచిన ఫిత్ర్ సారి.. మలేసియా జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. తాజా ఫలితంతో ఫైనల్‌కు ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్లు దూసుకెళ్లాయి. ఏడు పాయింట్లతో మూడో స్థానంలో టీమిండియా నిలిచింది. దీంతో కాంస్యపతకం కోసం న్యూజిలాండ్‌తో శనివారం భారత్ తలపడనుంది. -
మన్‌దీప్‌సింగ్ హ్యట్రిక్
జపాన్‌పై భారత్ విజయం ఇపో: మలేసియాలో జరుగుతున్న సుల్తాన్ అజ్లాన్‌షా హాకీ టోర్నీలో భారత్ తొలి విజయం నమోదు చేసింది. బుధవారం జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్ట్రైకర్ మన్దీప్ సింగ్ ‘హ్యాట్రిక్’ గోల్స్ నమోదు చేయడంతో 4–3తో టీమిండియా గెలుపొందింది. ఆట ఆరంభం (ఎనిమిదో నిమిషం)లో జట్టుకు లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్ పాల్ సింగ్ గోల్‌గా మలవడంతో 1–0తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే కాసేపటికే కజుమా మారతా (10వ నిమిషం)లో గోల్ చేయడంతో స్కోరును 1–1తో జపాన్ సమం చేసింది. అనంతరం ఇరుజట్లు గోల్ చేయడంలో రెండు క్వార్టర్లు ముగిసేసరికి గేమ్ సమంగా నిలిచింది. అయితే రెండు నిమిషాల వ్యవధిలో హీతా యోషిహరా (43వ ని.),లో గోల్ సాధించడంతో జపాన్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే కాసేపటికే మన్దీప్ సింగ్ తన తొలిగోల్ నమోదు చేయడంతో 2–2తో భారత్ స్కోరు సమం చేసింది. అయితే గెంకి మితాని (45వ ని.)లో గోల్ చేయడంతో జపాన్ 3–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే పది నిమిషాల తర్వాత కళ్లు చెదిరే రీతిలో మన్దీప్ మరోగోల్ చేయడంతో 3–3తో స్కోరును సమం చేసింది. మరో రెండు నిమిషాల తర్వాత మన్దీప్ మూడో గోల్ చేయడంతో 4–3తో భారత్ తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరిదాక ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ విజేతగా నిలిచింది. టోర్నీ నుంచి తప్పుకున్న శ్రీజేశ్ మరోవైపు మోకాలి గాయంతో కెప్టెన్ శ్రీజేశ్ జట్టు నుంచి తప్పుకున్నాడు. గాయం తగ్గడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని చీఫ్ కోచ్ రోలాంట్ ఓల్ట్‌మన్స్ పేర్కొన్నారు. దీంతో జూన్‌లో లండన్లోజరిగే వరల్డ్ లీగ్ సెమీస్‌కు దూరమవుతాడని తెలిపారు.