సౌతాంప్టన్: టీమిండియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కీటన్ జెన్నింగ్స్(0) డకౌట్‌గా పెవిలియన్ చేరగా, ఫస్ట్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ జో రూట్(4) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో ఇంగ్లండ్ 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కీటన్ జెన్నింగ్స్‌ను బూమ్రా ఎల్బీగా పెవిలియన్‌కు పంపగా, జో రూట్‌ను ఇషాంత్ శర్మ ఔట్ చేశాడు. జో రూట్ ఎల్బీడబ్యూకు ఇషాంత్ శర్మ అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. దాన్ని జో రూట్ సవాల్ చేసినా టీవీ రిప్లేలో ఆ బంతి క్లియర్‌గా మిడిల్ వికెట్ మీదకు వెళుతున్నట్లు తేలింది. దాంతో మరోసారి నిరాశపరిచిన రూట్ భారంగా పెవిలియన్ చేరాడు.
అంతకుముందు ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు ఆసక్తి చూపాడు. దాంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను అలెస్టర్ కుక్, జెన్నింగ్స్‌లు ఆరంభించారు. ఇక్కడ జెన్నింగ్స్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ పరుగు మాత్రమే చేసి వికెట్ కోల్పోయినట్లయ్యింది. ఆపై ఐదు ఓవర్ల అనంతరం రూట్ కూడా ఔట్ కావడంతో ఇంగ్లండ్‌కు మరో దెబ్బ తగిలింది.
Comments
Please login to add a commentAdd a comment