సౌంతాప్టన్ : మూడో టెస్టులో విజయంతో మంచి ఊపుమీదున్న టీమిండియా నాలుగో టెస్టులోనూ తన సత్తా చాటుతోంది. టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనలతో ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయింది.
- కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న షమీ, ఇషాంత్, బుమ్రాలను ఎదుర్కొని నిలబడిన బెన్ స్టోక్స్ (23) వికెట్ కోల్పోయాడు. 34 ఓవర్‌లో షమీ వేసిన అద్భుతమైన బంతికి స్టోక్స్ ఎల్‌బీగా పెవిలియన్ చేరాడు. దీంతో షమీ ఖాతాలో రెండు వికెట్లు చేరాయి. మొయిన్ అలీ (20), సామ్ క్యూరన్ (22) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ స్కోరు 43 ఓవర్లకు 124/6 గా ఉంది.
- ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్ (21)ను మహ్మద్ షమీ పెవిలియన్ పంపాడు. దీంతో జట్టు స్కోరు 69 పరుగుల వద్ద ఇంగ్లండ్ అయిదో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 27 ఓవర్లు ముగిసే సమయానికి 69/5 గా కొనసాగుతోంది. బెన్ స్టోక్స్ (16), మొయిన్ అలీ (0) క్రీజులో ఉన్నారు.
- 17వ ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన షార్ట్‌లెంగ్త్ బంతిని అనవరంగా ఆడిన అలిస్టర్ కుక్ థర్డ్ స్లిప్‌లో విరాట్ కోహ్లీకి సులభమైన క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయే సమయానికి ఇంగ్లండ్ జట్టు స్కోరు 36 పరుగులు మాత్రమే. కాగా, సమష్టిగా రాణిస్తున్న టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు పడగొట్టడం మంచి పరిణామం.
- బుమ్రా మరో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అద్భుత బంతితో బెయిర్ స్టో (6)ను బోల్తా కొట్టించాడు. అతను కొట్టిన బంతిని స్క్వేర్‌లో ఉన్న రిషభ్ పంత్ క్యాచ్ పట్టడంతో జట్టు స్కోరు 12 ఓవర్లకు 28 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది.
- నెమ్మదిగా సాగుతున్న ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మరో అలజడి మొదలైంది. జో రూట్ (4)ను ఇషాంత్ ఎల్‌బీగా వెనక్కుపంపాడు. అప్పటికీ ఇంగ్లండ్ స్కోరు 7 ఓవర్లకు 17 పరుగులు మాత్రమే.
- రెండో ఓవర్ మొదటి బంతికే ఓపెన్ జెన్నింగ్స్(0) ను జీస్ప్రీత్ బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఒక పరుగుకే ఇంగ్లండ్ ఓపెనర్ వికెట్‌ను కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment