మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో ట్వంటీ 20లో టీమిండియా ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత టీమిండియాను బ్యాటింగ్ ఆహ్వానించింది.
దీంతో టీమిండియా బ్యాటింగ్ ను రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లు ఆరంభించారు. రోహిత్(20 నాటౌట్),ధావన్(18 నాటౌట్)క్రీజ్ లో ఉన్నారు. తొలి ట్వంటీ 20లో గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించి సిరీస్ ను సాధించాలని భావిస్తోంది.