మెల్బోర్న్:టీమిండియాతో జరుగుతున్న రెండో ట్వంటీ 20లో ఆస్ట్రేలియా దీటుగా బదులిస్తోంది. టీమిండియా విసిరిన 185 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్(65నాటౌట్), లయన్(0 నాటౌట్) క్రీజ్ లో ఉన్నారు.
అంతకుముందు షాన్ మార్ష్(23) తొలి వికెట్ గా అవుటయ్యాడు. టాస్ ఓడిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసి మూడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.