భారత్ తో జరుగుతున్న రెండో టి20లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
మెల్ బోర్న్: భారత్ తో జరుగుతున్న రెండో టి20లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ధోని సే ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ఆశలు నిలుపుకోవాలని ఆసీస్ భావిస్తోంది. ఈరోజు మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ దక్కించు కోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
భారత్ జట్టులో ఎటువంటి మార్పులు లేదు. ఆస్ట్రేలియా టీమ్ లో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. జాన్ హాస్టింగ్స్, గ్లెన్ మ్యాక్స్ వెల్ జట్టులోకి వచ్చారు. మొదటి మ్యాచ్ లో ధోనిసేన గెలిచిన సంగతి తెలిసిందే.