మొయిన్ అలీ
సౌతాంప్టన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మన్ మరోసారి తడబాటుకు గురయ్యారు. 273 పరుగుల వద్ద భారత్ చివరి వికెట్‌ను కోల్పోయింది. ఏ ఒక్క ఆటగాడు కూడా పుజారాకు అండగా నిలవలేకపోగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. పుజారా 132 పరుగులతో చివరి వరకు పోరాడాడు. జట్టు స్కోర్ 142 వద్ద కోహ్లి అవుట్ కాగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే(11)ను దురదృష్ణం వెంటాడింది. అనంతరం పాండ్యా(4) సైతం అలీ బౌలింగ్‌లోనే క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు.
ఆ వెంటనే అశ్విన్ (1), షమీ(0)లను అలీ వరుస బంతుల్లో బౌల్డ్ చేశాడు. రిషబ్ బంత్ 29 బంతులాడి ఒక్క పరుగు చేయకుండా అలీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ కేవలం 53 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. . ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ భారత బ్యాట్స్‌మన్ పతనాన్ని శాసించాడు. వరుస బౌలర్లలో వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను తమవైపు లాగేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ 5, బ్రాడ్ 3, కరన్, స్టోక్స్‌లకు ఒక్కోవికెట్ దక్కింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 6/0తో నిలిచింది. మొదటి ఇన్సింగ్స్‌లో భారత్‌కు 27 పరుగుల స్పల్ప ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment