సౌతాంప్టన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో మైలురాయి అందుకున్నాడు. ధావన్ వికెట్ అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి అండర్సన్ బౌలింగ్‌లో బౌండరీ సాధించి టెస్టుల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో 6వేల క్లబ్‌లో చేరిన 10వ భారత్ బ్యాట్స్‌మన్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. అంతేకాకుండా వేగంగా (119 ఇన్నింగ్స్‌ల్లో) ఆరువేల క్లబ్‌లో చేరిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు.
కోహ్లి కన్నా ముందు సునీల్ గావాస్కర్ 117 ఇన్నింగ్స్‌లోనే ఆరువేల పరుగుల్ని పూర్తి చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 120 ఇన్నింగ్స్‌ల్లో 6 వేల పరుగుల మార్క్‌ని అందుకున్న సచిన్ టెండూల్కర్‌ను తాజాగా కోహ్లి అధిగమించాడు. అంతర్జాతీయ టెస్టుల్లో అత్యంత వేగంగా ఆరు వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆల్ టైమ్ గ్రేట్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బ్రాడ్‌మన్ కేవలం 68 ఇన్నింగ్స్‌లోనే టెస్ట్‌ల్లో ఆరువేల పరుగుల మైలురాయిని అధిగమించాడు.
19 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ త్వరగా ఓపెనర్లు కేఎల్ రాహుల్(19) ధావన్(23) వికెట్లు కోల్పోయింది. క్రీజులో పుజారా (27), విరాట్ కోహ్లి(21)లు ఆడుతున్నారు. లంచ్ విరామానికి 31 ఓవర్లలో భారత్ రెండు వికెట్లు నష్టపోయి 100 పరుగులు చేసింది. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246కు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment