భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్కు ఆసీస్ భారీ టార్గెట్ ఇవ్వనుందని క్రికెట్ అభిమానులు తెలిపారు.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్కు ఆసీస్ భారీ టార్గెట్ ఇవ్వనుందని క్రికెట్ అభిమానులు తెలిపారు. స్టీవెన్ స్మిత్ 68 పరుగులు చేసిన సమయంలో సెంచరీ సాధిస్తాడా అంటూ సాక్షి.. ఫేస్బుక్ ద్వారా ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. స్టేవెన్ స్మిత్ సెంచరీ చేస్తాడని, స్మిత్ సెంచరీ చేసినా చేయకపోయినా భారత్ ఈ మ్యాచ్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, భారీ టార్గెట్ భారత్ ముందు ఉండబోతుందని చెప్పారు. మరికొందరు స్మిత్ 120 పరుగులు చేస్తాడని, 200 చేస్తాడని కూడా అన్నారు. ఇంకొందరు మాత్రం భారీ టార్గెట్ను సాధించేందుకు భారత్ శ్రమ పడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం స్మిత్ సెంచరీ అనంతరం అవుటయ్యాడు.