యూఎస్ ఓపెన్ రెండో రౌండ్ చేరుకున్న లియాండర్ పేస్, రోహన్ బొపన్న.
ఇండియన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ యూఎస్ ఓపెన్ రెండో రౌండ్ కు చేరకున్నాడు. మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ లో కెనడా- ఆస్ట్రేలియా ద్వయం టైలర్ హారీ, సి లుయ్ జంటపై 6-2, 6-2స్కోర్ తో అలవోకగా గెలిచాడు. ఈ టోర్నీలో స్విస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ తో పేస్ జతకట్టాడు. మరో భారత క్రీడాకారుడు రోహన్ బొపన్న కూడా పురుషుల డబుల్స్ విభాగంలో రెండో రౌండ్ చేరుకున్నాడు.