ఏసెస్‌కు వరుసగా రెండో విజయం | Indian Aces down Singapore Slammers 27-22 in IPTL | Sakshi
Sakshi News home page

ఏసెస్‌కు వరుసగా రెండో విజయం

Published Sat, Dec 5 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 PM

ఏసెస్‌కు వరుసగా రెండో విజయం

ఏసెస్‌కు వరుసగా రెండో విజయం

కోబ్ (జపాన్): ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్స్ ఇండియన్ ఏసెస్ వరుసగా రెండో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఏసెస్ 27-22తో సింగపూర్ స్లామర్స్‌పై నెగ్గింది. లెజెండరీ సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కార్లోస్ మోయా (స్లామర్స్) 6-5తో ఫ్యాబ్రిస్ సంటారో (ఏసెస్)పై గెలుపొందగా... మహిళల సింగిల్స్‌లో కరోలినా ప్లిస్కోవా (స్లామర్స్) 6-4తో సమంతా స్టోసుర్ (ఏసెస్)ను ఓడించింది.

అయితే పురుషుల డబుల్స్‌లో డుడిగ్-బోపన్న (ఏసెస్) జోడి 6-4తో మార్సెలో మెలో-బ్రౌన్ (స్లామర్స్)పై; మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-డుడిగ్ (ఏసెస్) ద్వయం 6-3తో కిర్గియోస్-బెనిచ్ (స్లామర్స్)పై గెలిచారు. ఇక నిర్ణయాత్మక పురుషుల సింగిల్స్‌లో డుడిగ్ (ఏసెస్) అద్భుతంగా ఆడి 6-2తో కిర్గియోస్ (స్లామర్స్)పై నెగ్గడంతో ఏసెస్ 27-22తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో ఫిలిప్పిన్ మావెరిక్ 28-24తో జపాన్ వారియర్స్‌ను ఓడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement