ఇండియన్ ఏసెస్ శుభారంభం | Indian Aces started | Sakshi
Sakshi News home page

ఇండియన్ ఏసెస్ శుభారంభం

Published Sat, Dec 3 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

ఇండియన్ ఏసెస్ శుభారంభం

ఇండియన్ ఏసెస్ శుభారంభం

ఐపీటీఎల్ -2016

సైటమ (జపాన్): ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) తాజా సీజన్‌ను ఇండియన్ ఏసెస్ విజయంతో ప్రారంభించింది. శుక్రవారం జపాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30-17 తేడాతో సునాయాసంగా నెగ్గింది. ముందుగా జరిగిన మహిళల సింగిల్స్‌లో కిర్‌స్టెన్ ఫ్లిప్‌కెన్‌‌స 6-2 తేడాతో కురుమి నరాపై గెలిచింది. ఆ తర్వాత హోరాహోరీగా సాగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న-సానియా మీర్జా జోడి 6-5తో రోజర్-జంకోవిచ్ జంటపై నెగ్గింది.

పురుషుల లెజెండ్ సింగిల్స్‌లో ఫిలిప్పోసిస్ 6-3తో మరాత్ సఫిన్‌పై, పురుషుల డబుల్స్‌లో దోడిగ్-లోపెజ్ జోడీ 6-2తో రోజర్-వెర్డాస్కో జంటపై, పురుషుల సింగిల్స్‌లో ఫెలిసియానో లోపెజ్ 6-5తో వెర్డాస్కోపై గెలిచి జట్టుకు విజయాన్ని అందించారు. మరో మ్యాచ్‌లో యూఏఈ రాయల్స్ 29-19తో సింగపూర్ స్లామర్స్‌పై నెగ్గింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement