అఫ్రిదిపై మండిపడ్డ భారత క్రికెటర్లు | Indian Cricketers Slams Shahid Afridi | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 4 2018 6:08 PM | Last Updated on Wed, Apr 4 2018 8:11 PM

Indian Cricketers Slams Shahid Afridi - Sakshi

అఫ్రిది, కశ్మీర్‌, విరాట్‌ కోహ్లి, కపిల్‌ దేవ్‌, సురేశ్‌ రైనా

న్యూఢిల్లీ : భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదిపై టీమిండియా క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్పందించిన టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అఫ్రిది వ్యాఖ్యలను అంతగా పట్టించుకోనక్కరలేదని, అతను నోబాల్‌తో వికెట్‌ తీసి సంబరాలు చేసుకుంటున్నాడని సెటైర్‌ వేశాడు. తాజాగా అఫ్రిది వ్యాఖ్యలపై భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మాజీ కెప్టెన్‌ కపిల్ దేవ్‌ సీనియర్‌ ఆటగాళ్లు సురేశ్‌ రైనా, రవీంద్ర జడేజాలు ఘాటుగా స్పందించారు. ‘అతనెవరు. అతనికంతా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏముంది. అలాంటి వారికి మనం అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సింది కాదు’ అని కపిల్‌ దేవ్‌ అఫ్రిది వ్యాఖ్యలను ఉద్దేశించి మండిపడ్డారు. కశ్మీర్‌ ఎప్పటికి భారత్‌లో అతర్భాగమేనని, కశ్మీర్‌లోని కొంత భాగాన్ని పాక్‌ అక్రమించిందని కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అంతర్జాతీయ ఉగ్రవాదులను పక్కనబెట్టుకుని భారత్‌పై నిందలు వేయడం ఏమిటని అఫ్రిదిని జడేజా నిలదీసాడు. హఫీజ్‌ సయిద్‌ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా గుర్తిస్తే మీరు ప్రధాని చేయలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, కశ్మీర్‌ తమ పుర్వీకులు పుట్టిన పవిత్ర నేల అని రైనా ట్వీట్‌ చేశాడు. అఫ్రిది బాయ్‌ పాక్‌ ఆర్మీకి ఉగ్రవాదాన్ని ఆపమని చెబుతాడని తాను ఆశిస్తున్నట్లు, భారత్‌ ఎప్పుడు శాంతినే కోరుకుంటుందని, రక్తపాతం హింసను కోరుకోదని ట్వీట్‌లో పేర్కొన్నాడు. గత ఆదివారం కశ్మీర్‌లో భారత బలగాలు 13 మంది టెర్రరిస్టులను మట్టుబెడితే.. కశ్మీర్‌లో అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న భారత్‌పై ఐక్యరాజ్యసమితి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అఫ్రిది ట్విటర్‌లో ప్రశ్నించిన విషయం తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement