
న్యూఢిల్లీ: యూత్ ఒలింపిక్స్ బరిలో దిగనున్న భారత హాకీ అండర్–18 జట్ల షెడ్యూల్ ఖరారైంది. అర్జెంటీనాలో జరిగే ఈ క్రీడల్లో అక్టోబర్ 7న పురుషుల జట్టు తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో... మహిళల జట్టు ఆస్ట్రియాతో ఆడతాయి.
పూల్ ‘బి’లో పురుషుల జట్టు అక్టోబర్ 8న ఆస్ట్రియాతో, 9న కెన్యాతో, 10న ఆస్ట్రేలియాతో, 11న కెనడాతో ఆడనుంది. మహిళల బృందం పూల్ ‘ఎ’లో అక్టోబర్ 8న ఉరుగ్వేతో, 9న వనుతుతో, 10న అర్జెంటీనాతో, 11న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. హాకీ–5 ఫార్మాట్‌లో జరిగే ఈ పోటీల్లో ఐదుగురే బరిలోకి దిగుతారు.