ఢిల్లీ: భారత యువ షూటర్ మను బాకర్ ప్రపంచ వేదికపై మరోసారి అదరగొట్టింది. జర్మనీలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ ప్రపంచకప్‌లో ఆమె ప్రపంచ రికార్డుతో పసిడి పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పిస్టల్ పోటీ ఫైనల్లో మను 242.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలిచింది. 24 షాట్ల ఫైనల్లో 242.5 పాయింట్లు సాధించడం ద్వారా జూనియర్ స్థాయిలో మను వరల్డ్ రికార్డును ఖాతాలో వేసుకుంది.
ఈ ఏడాది మనుకు ఏడో అంతర్జాతీయ వ్యక్తిగత స్వర్ణం కావడం విశేషం. ప్రపంచ రికార్డు ప్రదర్శనతో ఆమె స్వర్ణం గెలవడమిది మూడోసారి. ఈ టోర్నీలో అనీష్ భన్వాలా పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో కాంస్యం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment