భారత మహిళా జట్టుకు టైటిల్‌ | Indian womens team got throw ball title | Sakshi
Sakshi News home page

భారత మహిళా జట్టుకు టైటిల్‌

Published Sat, Nov 11 2017 10:38 AM | Last Updated on Sat, Nov 11 2017 10:38 AM

Indian womens team got throw ball title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక త్రోబాల్‌ టోర్నమెంట్‌లో టీమిండియా మహిళల జట్టు సత్తా చాటింది. శ్రీలంకలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి టైటిల్‌ను దక్కించుకుంది. శుక్రవారం జరిగిన మహిళల పైనల్లో భారత్‌ (3 – 0) 25–9, 25–16, 25–8తో శ్రీలంకపై వరుస గేముల్లో విజయాన్ని సాధించింది.

మరోవైపు భారత పురుషుల జట్టుకు నిరాశ ఎదురైంది. ఫైనల్లో భారత్‌ (2–3) 24–26, 25–22, 15–25, 25–22, 20–25తో శ్రీలంక చేతిలో ఓడింది. ఈ సిరీస్‌కు భవన్స్‌ శ్రీఅరబిందో జూనియర్‌ కాలేజి ఫిజికల్‌ డైరెక్టర్‌ రాము టెక్నికల్‌ రిఫరీగా వ్యవహరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement