ఆడలేనన్నా... ఇంటికి విమాన టిక్కెట్లు | Injured Kashyap wants 'rest', gets air-tickets for SAG | Sakshi
Sakshi News home page

ఆడలేనన్నా... ఇంటికి విమాన టిక్కెట్లు

Published Wed, Feb 3 2016 12:32 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

ఆడలేనన్నా... ఇంటికి విమాన టిక్కెట్లు - Sakshi

ఆడలేనన్నా... ఇంటికి విమాన టిక్కెట్లు

- కశ్యప్
న్యూఢిల్లీ: కడుపులో కండరాల గాయం కారణంగా దక్షిణాసియా గేమ్స్‌లో పాల్గొనలేనని చెప్పినా... గువహాటికి వెళ్లేందుకు తనకు విమాన టిక్కెట్లు పంపించారని స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ ఆవేదన వ్యక్తం చేశాడు. టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు లిఖితపూర్వకంగా తెలియజేసినా... ‘బాయ్’ తనను మరో రకంగా ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శిం చాడు. ‘గాయం కారణంగా నేను చాలా సమయాన్ని కోల్పోయా. దాదాపు ఏడు టోర్నీలకు గైర్హాజరైనా... తప్పనిసరి పరిస్థితుల్లో పీబీఎల్, సయ్యద్ మోదీలో బరిలోకి దిగా. దీంతో గాయం తిరగబెట్టింది.

ఫలితంగా థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి వైదొలిగా. కానీ ఇప్పుడు దక్షిణాసియా గేమ్స్‌లో ఆడాలని బాయ్, క్రీడాశాఖ కోరుతోంది. అయితే నేను ఆడే పరిస్థితుల్లో లేను. ఇందుకు సంబంధించి లేఖలు కూడా పంపా. అయినాగానీ గువహాటి వెళ్లేందుకు నాకు విమాన టిక్కెట్లు పంపారు. ఇది చాలా నిరాశ కలిగించే అంశం’ అని కశ్యప్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement