ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ | James Anderson ruled out of fifth Test in India | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ

Published Thu, Dec 15 2016 2:19 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ

ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ

చెన్నై:ఇప్పటికే భారత్తో టెస్టు సిరీస్ కోల్పోయి సతమవుతున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్ చివరిదైన ఐదో టెస్టుకు దూరమయ్యాడు.  అండర్సన్ భుజం గాయం మరోసారి తిరగబెట్టడంతో అతనికి విశ్రాంతినివ్వక తప్పలేదు.  భారత్తో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా విశాఖలో జరిగిన రెండో టెస్టులో ద్వారా జట్టులోకి వచ్చిన అండర్సన్..మూడు, నాలుగు టెస్టులో పాల్గొన్నాడు. 

 

అయితే అండర్సన్కు గాయం తిరగబెట్టిన నేపథ్యంలో అతనికి ఐదో టెస్టు నుంచి విశ్రాంతినిస్తున్నట్లు కెప్టెన్ అలెస్టర్ కుక్ తెలిపాడు. ఇప్పటికే మరో పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కుడిపాదం గాయంతో మూడు, నాలుగు టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగే చివరి టెస్టుకు బ్రాడ్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్రాడ్ ఫిట్గా ఉన్నట్లు కుక్ పేర్కొన్నాడు. ఈ టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ 0-3 తేడాతో వెనుకబడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement