అండర్సన్ వచ్చేస్తున్నాడు! | James Anderson to Join England Squad in India | Sakshi
Sakshi News home page

అండర్సన్ వచ్చేస్తున్నాడు!

Published Sat, Nov 5 2016 3:27 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

అండర్సన్ వచ్చేస్తున్నాడు!

అండర్సన్ వచ్చేస్తున్నాడు!

లండన్: గత కొంతకాలంగా గాయంతో బాధపడుతూ ఇంగ్లండ్ జట్టుకు దూరంగా ఉంటున్న ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్.. భారత్తో జరిగే సుదీర్ఘ ద్వైపాక్షిక సిరీస్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు.  తాజాగా అండర్సన్కు నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో పాస్ కావడంతో అతను భారత్తో జరిగే సిరీస్లో పాల్గొననున్నాడు. ఈ మేరకు త్వరలో అండర్సన్ భారత్కు పయనం కానున్నట్లు ఈసీబీ స్పష్టం చేసింది. నేషనల్ క్రికెట్ పెర్ఫామెన్స్ సెంటర్లో అండర్సన్ కు నిర్వహించిన ఫిట్ నెస్ పరీక్షల్లో పాసయినట్లు క్రికెట్ బోర్డు తెలిపింది.

కొన్ని నెలులుగా భుజం గాయంతో ప్రధాన టోర్నీలకు దూరంగా ఉన్న అండర్సన్ జట్టుతో కలవడం ఇంగ్లండ్ కు కచ్చితంగా అదనపు బలమే. అయితే ఈనెల 9వ తేదీన రాజ్కోట్లో ఆరంభమయ్యే తొలి టెస్టు నాటికి అండర్సన్ అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. భారత్ లో సిరీస్లో పాల్గొనేందుకు అండర్సన్ కు లైన్ క్లియరైనప్పటికీ రెండో టెస్టు మొదలయ్యే సమయానికి అతను జట్టుతో కలిసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement