ఇంగ్లండ్‌ 271/8 | Jos Buttler counter attacks after Mitchell Marsh stuns England | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ 271/8

Published Fri, Sep 13 2019 2:31 AM | Last Updated on Fri, Sep 13 2019 11:15 AM

Jos Buttler counter attacks after Mitchell Marsh stuns England - Sakshi

లండన్‌: కాస్త తడబడినా... విధ్వంసక బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ (84 బంతుల్లో 64 బ్యాటింగ్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడైన అర్ధ సెంచరీతో ఆదుకోవడంతో యాషెస్‌ సిరీస్‌ ఐదో టెస్టును ఇంగ్లండ్‌ ఆశావహంగానే ప్రారంభించింది. ఆస్ట్రేలియాతో ఇక్కడి ఓవల్‌ మైదానంలో గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆట ముగిసేసరికి ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ అనూహ్యంగా బౌలింగ్‌ ఎంచుకుంది. డెన్లీ (14) త్వరగానే ఔటైనా మరో ఓపెనర్‌ బర్న్స్‌ (87 బంతుల్లో 47; 7 ఫోర్లు) తోడుగా కెప్టెన్‌ జో రూట్‌ (141 బంతుల్లో 57; 3 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.

రెండో వికెట్‌కు వీరు 76 పరుగులు జోడించారు. 103/1తో ఆతిథ్య జట్టు మెరుగ్గా కనిపించిన స్థితిలో కంగారూ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ (4/35) దెబ్బకొట్టాడు. వరుసగా స్టోక్స్‌ (20), బెయిర్‌ స్టో (22), కరన్‌ (15), వోక్స్‌ (2)లను ఔట్‌ చేశాడు. రూట్‌ వికెట్లను కమిన్స్‌ (2/73) గిరాటేశాడు. అయితే, బట్లర్‌ ఫటాఫట్‌ షాట్లతో చెలరేగాడు. హాజల్‌వుడ్‌ (2/76) బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు బాదాడు. జట్టు స్కోరును 200 దాటించాడు. లీచ్‌ (31 బంతుల్లో 10 బ్యాటింగ్‌; ఫోర్‌)తో కలిసి అబేధ్యమైన 9 వికెట్‌కు 45 పరుగులు జత చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement