క్వార్టర్స్‌లో కశ్యప్
ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, సిరిల్ వర్మ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. వీరిద్దరితో పాటు ప్రణయ్, సౌరభ్ వర్మ కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు.
బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో కశ్యప్ 21–9, 21–8తో ఆస్కార్ గువో (న్యూజిలాండ్)పై, సిరిల్ వర్మ 21–14, 21–16తో సపుత్ర విక్కీ అంగా (ఇండోనేసియా)పై విజయం సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణయ్ 23–21, 21–18తో ఫర్మాన్ అబ్దుల్ ఖాలిక్ (ఇండోనేసియా)పై, సౌరభ్ వర్మ 21–16, 21–16తో విబవో (ఇండోనేసియా)పై గెలిచారు.