న్యూఢిల్లీ: హైదరాబాద్ రంజీ జట్టు మాజీ ఆటగాడు ఆర్.శ్రీధర్ ఐపీఎల్-7లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా హైదరాబాద్ జట్టుకు 12 ఏళ్లపాటు సేవలందించిన శ్రీధర్ 2001లో కోచ్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో భారత యువ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. కింగ్స్ ఎలెవన్ జట్టుకు పంజాబ్ ఫ్రాంచైజీ తనను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని 43 ఏళ్ల శ్రీధర్ అన్నాడు.
యువకులు, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉన్న పంజాబ్ జట్టును ఐపీఎల్-7లో విజయపథంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానన్నాడు. శ్రీధర్ నియామకం పట్ల పంజాబ్ కోచ్ సంజయ్ బంగర్ సంతోషం వ్యక్తం చేశాడు.
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీధర్
Published Thu, Mar 27 2014 12:00 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement