
జైపూర్: ఐపీఎల్‌లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. క్రిస్ గేల్(79; 47 బంతుల్లో 8 ఫోర్లు, 4 ఫోర్లు), సర్ఫరాజ్ ఖాన్(46 నాటౌట్; 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఆదిలోనే కేఎల్ రాహుల్(4) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో మయాంక్ అగర్వాల్-గేల్ జోడి సమయోచితంగా బ్యాటింగ్ చేసింది. వీరిద్దరూ 56 పరుగులు జోడించిన తర్వాత మయాంక్(22) రెండో వికెట్‌గా ఔటయ్యాడు.
ఆపై సర్పరాజ్ ఖాన్‌తో ఇన్నింగ్స్‌ను గేల్ ముందుకు తీసుకెళ్లాడు. ప్రధానంగా ఉనాద్కత్ వేసిన 12 ఓవర్‌లో మూడు ఫోర్లు, 1 సిక‍్సర్ కొట్టాడు. ఆ ఓవర్‌లో 19 పరుగుల్ని గేల్ సాధించాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే అర్థ శతకం తర్వాత గేల్ జోరు పెంచాడు. బెన్ స్టోక్ వేసిన 16 ఓవర్‌లో గేల్ 18 పరుగులు సాధించడంతో కింగ్స్ పంజాబ్ స్కోరులో వేగం పెరిగింది. కాగా, అదే ఓవర్ ఆఖరి బంతికి భారీ షాట్‌కు యత్నించిన గేల్..బౌండరీ లైన్ వద్ద రాహుల్ త్రిపాఠీ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఆపై సర్పరాజ్ ఖాన్ సమయోచితంగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment