ఆదివారం జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ పోరులో కివీస్కు కొంత గడ్డు పరిస్థితి తప్పదని క్రికెట్ అభిమానులు చెప్తున్నారు.
ఆదివారం జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ పోరులో కివీస్కు కొంత గడ్డు పరిస్థితి తప్పదని క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో 39 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన కివీస్ పోరాడుతుందని మీరు భావిస్తున్నారా అంటూ క్రికెట్ అభిమానులను సాక్షి.. ఫేస్ బుక్ ద్వారా ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కివీస్ 200 పరుగులు చేయడంకూడా కష్టంగా ఉండొచ్చని అంటున్నారు. కివీస్ పోరాటం బాగానే చేస్తుందని,
కానీ, ఆస్ట్రేలియానే గెలుస్తుందా అనే అనుమానం కూడా కలుగుతుందని చెప్పారు. తాము మాత్రం న్యూజిలాండ్ గెలవాలని కోరుకుంటామని చెప్పారు. మరికొందరేమో.. కివీస్ 280 నుంచి 300 పరుగులు చేయొచ్చని, విజయం తప్పకుండా సాధిస్తుందని అంటున్నారు. 23 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ప్రస్తుతం 83 పరుగులతో క్రీజులో ఉంది.