భారత కెప్టెన్‌గా కోహ్లీ అరుదైన రికార్డు | Kohli first Indian captain to notch two hundreds against the West Indies | Sakshi
Sakshi News home page

భారత కెప్టెన్‌గా కోహ్లీ అరుదైన రికార్డు

Published Fri, Jul 7 2017 10:38 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM

భారత కెప్టెన్‌గా కోహ్లీ అరుదైన రికార్డు

భారత కెప్టెన్‌గా కోహ్లీ అరుదైన రికార్డు

కింగ్‌స్టన్‌: వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన ఐదో వన్డేలో అజేయ శతకంతో చెలరేగిన  విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్‌గా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ శతకంతో విండీస్ జట్టుపై కరీబియన్ గడ్డపై రెండు శతకాలు నమోదు చేసిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. గతంలో కరీబియన్ గడ్డ మీద విండీస్‌ జట్టుపై సెంచరీ చేసిన కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డును సమం చేసిన కోహ్లీ.. కింగ్‌స్టన్‌లో గురువారం జరిగిన (డై/నైట్) ఐదో వన్డేలో అజేయ శతకంతో ద్రావిడ్ రికార్డును అధిగమించాడు. విండీస్ జట్టుపై అతడికిది నాలుగో సెంచరీ.

కోహ్లీ వన్డే కెరీర్‌లో ఓవరాల్‌గా ఇది 28వ శతకం కాగా, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక మాజీ క్రికెటర్‌ సనత్ జయసూర్యతో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. 433 ఇన్నింగ్స్‌ల్లో జయసూర్య 28 శతకాలు సాధించగా, కోహ్లి కేవలం 181 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. ఛేజింగ్ వీరుడిగా పేరున్న కోహ్లి.. ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. ఛేజింగ్‌లో 5159 పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లి, శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్ధనే (5150 పరుగులు)ను వెనక్కి నెట్టాడు. జయవర్దనే తర్వాతి స్థానాల్లో అరవింద డిసిల్వా(5134), ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(5074) ఉన్నారు. తాజా శతకంతో ఛేజింగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ(18 సెంచరీలు) నిలిచాడు. గతంలో ఈ రికార్డు సచిన్(17) పేరిట ఉండేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement