జింబాబ్వే పర్యటనలో భారత్‌ను విజయపథంలో నడిపించిన విరాట్ కోహ్లిపై ధోని ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్‌గా తన స్థానాన్ని భర్తీ చేసే అవకాశం అతనికే ఉందన్నాడు. ‘కోహ్లి అద్భుతమైన క్రికెటర్. ఆట గురించి అతనికి మంచి పరిజ్ఞానం ఉంది. కెప్టెన్‌గా కూడా రాణించాడు. అతనిలో అన్ని రకాల నైపుణ్యాలూ ఉన్నాయి.
న్యూఢిల్లీ: జింబాబ్వే పర్యటనలో భారత్‌ను విజయపథంలో నడిపించిన విరాట్ కోహ్లిపై ధోని ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్‌గా తన స్థానాన్ని భర్తీ చేసే అవకాశం అతనికే ఉందన్నాడు. ‘కోహ్లి అద్భుతమైన క్రికెటర్. ఆట గురించి అతనికి మంచి పరిజ్ఞానం ఉంది. కెప్టెన్‌గా కూడా రాణించాడు. అతనిలో అన్ని రకాల నైపుణ్యాలూ ఉన్నాయి. మైదానంలో కూడా తన భావాన్ని చక్కగా వ్యక్తం చేయగలడు’ అని ధోని అభిప్రాయ పడ్డాడు. నవంబర్ చివర్లో జరిగే దక్షిణాఫ్రికా సిరీస్ గురించి ప్రస్తుతానికి ఆలోచించడం లేదని, అంతకు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డేలపైనే తన దృష్టి ఉందని భారత కెప్టెన్ పేర్కొన్నాడు.
అందరినీ గౌరవించాలి
మాజీ ఆటగాళ్ల తరహాలో ఆల్‌టైమ్ భారత అత్యుత్తమ జట్టును తాను ఎప్పటికీ ప్రకటించనని ధోని స్పష్టం చేశాడు. అసలు అలాంటి ఆలోచనకే తాను దూరమని అతను చెప్పాడు. ఇటీవలే మాజీ కెప్టెన్లు కపిల్‌దేవ్, గంగూలీ తమ దృష్టిలో భారత అత్యుత్తమ టెస్టు, వన్డే జట్లను ప్రకటించారు. ‘వేర్వేరు తరాల్లో ఆడిన ఆటగాళ్లు, జట్ల మధ్య పోలిక తేవడం, వారందరినీ ఒక చోటికి చేర్చడం చాలా కష్టమైన పని. వ్యక్తిగతంగా మాత్రం నా అత్యుత్తమ జట్టు అంటూ ఒకదానిని నేను ఎప్పుడూ ఎంపిక చేయను. భారత్‌కు ఆడిన ప్రతీ ఆటగాడిని మనం గౌరవించాల్సిందే’ అని ధోని అభిప్రాయ పడ్డాడు