కోహ్లీ గురించి గంగూలీ ఏమన్నాడంటే.. | Kohli one of my favourite captains: Sourav Ganguly | Sakshi
Sakshi News home page

కోహ్లీ గురించి గంగూలీ ఏమన్నాడంటే..

Published Thu, Sep 15 2016 8:20 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

కోహ్లీ గురించి గంగూలీ ఏమన్నాడంటే..

కోహ్లీ గురించి గంగూలీ ఏమన్నాడంటే..

కోల్కతా: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ సారథి సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. తన ఫేవరేట్ కెప్టెన్లలో విరాట్ ఒకడని దాదా అన్నాడు.

'విరాట్ దూకుడైన క్రికెటర్. అతను తక్కువ కెరీర్లోనే దేశంకోసం ఎన్నో అద్భుతాలు చేశాడు. టీమిండియాను గెలిపించాలనే తపన, పోరాట స్ఫూర్తి, అంకితభావం కోహ్లీలో కనిపిస్తాయి. భారత కెప్టెన్గా లేదా బ్యాటింగ్కు వెళ్లేటపుడు అతని ముఖం చూస్తే సాధించాలన్న తపన కనిపిస్తుంది. ఇప్పుడు దేశానికి అతని అవసరముంది. భారత క్రికెట్కు అతను గొప్ప బలం' అని దాదా చెప్పాడు.

స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్లో టీమిండియానే ఫేవరేటని గంగూలీ అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై భారత్ దాదాపుగా అజేయమైన జట్టని, న్యూజిలాండ్ సహా ఈ విషయం అందరికీ తెలుసునని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement