బ్రాత్‌వైట్, శామ్యూల్స్ సెంచరీలు | Kraigg Brathwaite, Marlon Samuels hit centuries against South Africa | Sakshi
Sakshi News home page

బ్రాత్‌వైట్, శామ్యూల్స్ సెంచరీలు

Published Tue, Dec 30 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

బ్రాత్‌వైట్, శామ్యూల్స్ సెంచరీలు

బ్రాత్‌వైట్, శామ్యూల్స్ సెంచరీలు

పోర్ట్‌ఎలిజబెత్: ఓపెనర్ బ్రాత్‌వైట్ (186 బంతుల్లో 106; 12 ఫోర్లు), మార్లన్ శామ్యూల్స్ (160 బంతుల్లో 101; 14 ఫోర్లు; 1  సిక్స్) అద్భుత సెంచరీలతో భారీ స్కోరుకు బాటలు వేసినా... మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం కరువైంది. మోర్కెల్ (4/69), తాహిర్ (3/108) ధాటికి జట్టు కుదేలైపోయింది. దీంతో సోమవారం ఆట ముగిసే సమయానికి  వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 79 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జెరోమ్ టేలర్ (10 బ్యాటింగ్) ఉన్నాడు.

చివర్లో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ వీలు కాలేదు. అంతకుముందు 147/2 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన విండీస్‌ను బ్రాత్‌వైట్, శామ్యూల్స్ అద్భుత ఆటతీరుతో ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 176 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే వీరిద్దరు వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరడంతో విండీస్ కష్టాల్లో పడింది. ఓ దశలో 233/4తో పటిష్టంగా ఉన్న విండీస్ కేవలం 42 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ను 417/8 స్కోరువద్ద డిక్లేర్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement