కింగ్‌స్టన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తమ సభ్య దేశాలన్నింటి మీదా ఒకేలాంటి వైఖరి అవలంభించడం లేదని వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ఆరోపించారు. విండీస్‌పై ఓ నిబంధన.. భారత్‌పై ఓ నిబంధన అమలు పరుస్తున్నారని దెప్పిపొడిచారు. టి20 ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్‌కు ఐసీసీ మందలింపుపై ఆయన ఈ రకంగా విమర్శించారు.
టైటిల్ గెలిచాక తమ క్రికెట్ బోర్డుపై స్యామీ, శామ్యూల్స్, బ్రేవో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చర్య ఐసీసీకి ఆగ్రహం తెప్పించింది. ఇటీవలి తమ బోర్డు సమావేశంలో ఓ ప్రకటన విడుదల చేశారు. విండీస్ ఆటగాళ్లు అనుచితంగా ప్రవర్తించారని, బోర్డుకు అప్రతిష్ట తెచ్చారని పేర్కొంది. అయితే దీనిపై రిచర్డ్స్ గళమెత్తారు.
ఐసీసీది ద్వంద్వ వైఖరి: రిచర్డ్స్
Published Sat, Apr 30 2016 1:18 AM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM
Advertisement
Advertisement