ఫైనల్లో ఆస్ట్రేలియా
► 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై గెలుపు
► ముక్కోణపు వన్డే సిరీస్
బ్రిడ్జ్‌టౌన్: బ్యాటిం గ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఫైనల్‌కు చేరింది. కెన్సింగ్‌టన్ ఓవల్ మైదానంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 50 ఓవ ర్లలో 8 వికెట్లకు 282 పరుగులు చేసింది. శామ్యూల్స్ (134 బంతుల్లో 125; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆసీస్‌పై తొలి సెంచరీతో ఆకట్టుకోగా...రామ్ దిన్ (92 బంతుల్లో 91; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) కొద్దిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.
ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు, ఫాల్క్‌నర్, బొలాండ్ చెరో 2 వికె ట్లతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసి విజయం సాధించింది. స్మిత్ (107 బంతుల్లో 78; 5 ఫోర్లు), మార్ష్ (85 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించగా... మ్యాక్స్‌వెల్ (26 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. శామ్యూల్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.