huge score
-
దక్షిణాఫ్రికా 283/3
సెంచూరియన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. సూపర్‌స్పోర్ట్ పార్క్ మైదానంలో శనివారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 88 ఓవర్లలో 3 వికెట్లకు 283 పరుగులు చేసింది. స్టీఫెన్ కుక్ (143 బంతుల్లో 56; 9 పోర్లు), డికాక్ (114 బంతుల్లో 82; 15 ఫోర్లు), ఆమ్లా (91 బంతుల్లో 67; 9 ఫోర్లు, 1 సిక్సర్), డుమిని (122 బంతుల్లో 67; 10 ఫోర్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. న్యూజి లాండ్ బౌలర్లలో వాగ్నర్ 2 వికెట్లు, బ్రేస్‌వెల్ ఒక వికెట్ తీశారు. -
బ్రాత్‌వైట్, శామ్యూల్స్ సెంచరీలు
పోర్ట్ఎలిజబెత్: ఓపెనర్ బ్రాత్‌వైట్ (186 బంతుల్లో 106; 12 ఫోర్లు), మార్లన్ శామ్యూల్స్ (160 బంతుల్లో 101; 14 ఫోర్లు; 1 సిక్స్) అద్భుత సెంచరీలతో భారీ స్కోరుకు బాటలు వేసినా... మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం కరువైంది. మోర్కెల్ (4/69), తాహిర్ (3/108) ధాటికి జట్టు కుదేలైపోయింది. దీంతో సోమవారం ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 79 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జెరోమ్ టేలర్ (10 బ్యాటింగ్) ఉన్నాడు. చివర్లో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ వీలు కాలేదు. అంతకుముందు 147/2 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన విండీస్‌ను బ్రాత్‌వైట్, శామ్యూల్స్ అద్భుత ఆటతీరుతో ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 176 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే వీరిద్దరు వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరడంతో విండీస్ కష్టాల్లో పడింది. ఓ దశలో 233/4తో పటిష్టంగా ఉన్న విండీస్ కేవలం 42 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ను 417/8 స్కోరువద్ద డిక్లేర్ చేసింది. -
బంగ్లాదేశ్ భారీస్కోరు
ఖుల్నా: ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (109), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ షకీబుల్ హసన్ (137)లు సెంచరీలు సాధించడంతో జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ జట్టు 433 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ మొదలు పెట్టిన జింబాబ్వే రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. మసకద్జ (15), బ్రియాన్ చారీ (21)లు క్రీజ్‌లో ఉన్నారు. ఓవర్‌నైట్ స్కోరు 193/3తో రెండో రోజును మొదలెట్టిన బంగ్లాదేశ్‌కు తమీమ్, షకీబ్‌ల జోడి 132 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. -
సెంచరీతో కదంతొక్కిన శ్యామ్
జింఖానా, న్యూస్‌లైన్: జిందా సీసీ బ్యాట్స్‌మన్ శ్యామ్ (133) సెంచరీతో కదం తొక్కాడు. పాషా బీడీ జట్టుతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో జిందా సీసీ ఎనిమిది వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోరు చేసింది. జట్టులో ఫరాజ్ నవీద్ (82), సయ్యద్ షాబాజ్ (52) అర్ధ సెంచరీలతో రాణించగా, సన్ని 32 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పాషా బీడీ బౌలర్ సౌరవ్ కుమార్ 6 వికె ట్లు పడగొట్టాడు. మరో మ్యాచ్‌లో మెగా సీటీ జట్టు 101 పరుగుల తేడాతో బాలాజీ కోల్ట్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన మెగా సిటీ జట్టు తొమ్మిది వికెట్లకు 298 పరుగులు చేసింది. అభిజిత్ కుమార్ (62), శ్రేయాస్ (70) అర్ధ సెంచరీలతో చెలరేగగా, అనిరుధ్ రెడ్డి 40 పరుగులు చేసి చక్కని ఆటతీరు కనబరిచాడు. బాలాజీ కోల్ట్స్ బౌలర్లు నవజ్యోత్ సింగ్ 3, నవదీప్ సింగ్ 4 వికెట్లు తీసుకున్నారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బాలాజీ కోల్ట్స్ 194 పరుగుల వద్ద ఆలౌటైంది. రతన్ శర్మ (65) అర్ధ సెంచరీ చేయగా, అమిత్ యాదవ్ 37, రమేష్ 38 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. మెగాసిటీ బౌలర్ శ్రవణ్ నాలుగు వికె ట్లు చేజిక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు నేషనల్ సీసీ: 115 (ప్రసాద్ 32; ప్రీతమ్ 5/23, దినేష్ గౌడ్ 4/18); రాజు సీసీ: 70/2 (ప్రీతమ్ 34 పరుగులతో క్రీజులో ఉన్నాడు). వీనస్ సైబర్‌టెక్: 169 (శ్రీకాంత్ రాజు 39; సూర్య విక్రమాదిత్య 5/60, ప్రసన్న 5/30); అవర్స్: 52/3.