సెంచరీతో కదంతొక్కిన శ్యామ్ | shyam did century | Sakshi
Sakshi News home page

సెంచరీతో కదంతొక్కిన శ్యామ్

Published Fri, Oct 18 2013 12:04 AM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM

shyam did century

 జింఖానా, న్యూస్‌లైన్: జిందా సీసీ బ్యాట్స్‌మన్ శ్యామ్ (133) సెంచరీతో కదం తొక్కాడు. పాషా బీడీ జట్టుతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో జిందా సీసీ ఎనిమిది వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోరు చేసింది. జట్టులో ఫరాజ్ నవీద్ (82), సయ్యద్ షాబాజ్ (52) అర్ధ సెంచరీలతో రాణించగా, సన్ని 32 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పాషా బీడీ బౌలర్ సౌరవ్ కుమార్ 6 వికె ట్లు పడగొట్టాడు. మరో మ్యాచ్‌లో మెగా సీటీ జట్టు 101 పరుగుల తేడాతో బాలాజీ కోల్ట్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన మెగా సిటీ జట్టు తొమ్మిది వికెట్లకు 298 పరుగులు చేసింది.
 
 అభిజిత్ కుమార్ (62), శ్రేయాస్ (70) అర్ధ సెంచరీలతో చెలరేగగా, అనిరుధ్ రెడ్డి 40 పరుగులు చేసి చక్కని ఆటతీరు కనబరిచాడు. బాలాజీ కోల్ట్స్ బౌలర్లు నవజ్యోత్ సింగ్ 3, నవదీప్ సింగ్ 4 వికెట్లు తీసుకున్నారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బాలాజీ కోల్ట్స్ 194 పరుగుల వద్ద ఆలౌటైంది. రతన్ శర్మ (65) అర్ధ సెంచరీ చేయగా, అమిత్ యాదవ్ 37, రమేష్ 38 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. మెగాసిటీ బౌలర్ శ్రవణ్ నాలుగు వికె ట్లు చేజిక్కించుకున్నాడు.
 
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 నేషనల్ సీసీ: 115 (ప్రసాద్ 32; ప్రీతమ్ 5/23, దినేష్ గౌడ్ 4/18); రాజు సీసీ: 70/2 (ప్రీతమ్ 34 పరుగులతో క్రీజులో ఉన్నాడు).
 
 వీనస్ సైబర్‌టెక్: 169 (శ్రీకాంత్ రాజు 39; సూర్య విక్రమాదిత్య 5/60, ప్రసన్న 5/30); అవర్స్: 52/3.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement