
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం (బీఏటీ) అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీ, పారిశ్రామిక, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) రెండోసారి ఎన్నికయ్యారు. ఆదివారం గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో జరిగిన తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం వార్షిక సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.
భారత జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా చాముండేశ్వరీనాథ్, వై. ఉపేందర్‌రావు, ఎ. రామారావు, పి. రమేశ్ రెడ్డి, జి. వెంకట రావు నియమితులయ్యారు. వీరితో పాటు ఇతర కార్యవర్గాన్నీ ప్రకటించారు. కోశాధికారిగా కె. పాణి రావు, సలహాదారుగా కె. శ్రీనివాస్, గౌరవ కార్యదర్శులుగా పీసీఎస్ రావు, కె. వాసు, ఆర్.ఎం.వి. రామచందర్ రావు ఎంపికవగా... ఇతర సభ్యులుగా ఎల్. రవికుమార్, బీవీఎస్ మనోహర్, పి. రామ్మోహన్ రావు, ఎస్. రమేశ్ కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment