
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. కేకేఆర్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో శిఖర్ ధావన్(34), కేన్ విలియమ్సన్(3)లు పెవిలియన్ చేరారు. ఆ ఓవర్ తొలి బంతికి ధావన్ ఎల్బీ డబ్యూగా ఔట్ కాగా, ఐదో బంతికి విలియమ్సన్ క్యాచ్ ఇచ‍్చి పెవిలియన్ చేరాడు. దాంతో సన్‌రైజర్స్ 7.5 ఓవర్లలో 60 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను సాహా, ధావన్‌లు ఆరంభించారు. వీరిద్దరూ నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. కాగా, కుల్దీప్ యాదవ్ తన తొలి ఓవర్‌లోనే సన్‌రైజర్స్‌కు షాకిచ్చాడు. తన మ్యాజిక్ బౌలింగ్‌తో రెండు వికెట్లను సాధించాడు.