
కుమార ధర్మసేన అరుదైన ఘనత
మెల్ బోర్న్: శ్రీలంక మాజీ క్రికెటర్, ప్రస్తుత అంపైర్ కుమార ధర్మసేన అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నాడు. 1996 వరల్డ్ కప్ ను గెలిచిన శ్రీలంక జట్టులో ధర్మసేన సభ్యుడు. ఆ ఫైనల్ టీంలో సభ్యుడిగా ఉన్న ధర్మసేన.. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ల మధ్య ఆదివారం జరగబోయే వరల్డ్ కప్ ఫైనల్ కు అంపైర్ గా వ్యవహరించనున్నాడు.
ఇలా ఆటగాడిగా, అంపైర్ గా భాగమవుతున్న మొదటి వ్యక్తి ధర్మసేననే. దీంతో ధర్మసేన పేరిట సరికొత్త ఘనత ఆవిష్క్రతం కాబోతుంది.1996 ఫైనల్లో శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి వరల్డ్ కప్ ను కైవశం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో 10 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన ధర్మసేన 47 పరుగులిచ్చిఒక వికెట్ తీశాడు.