న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్ సెమీస్లో టీమిండియా ఓటమికి (ఆస్ట్రేలియా చేతిలో) బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మే కారణమని నెటిజెన్లు ఆడిపోసుకున్నారు! అనుష్క మ్యాచ్ చూసేందుకు వెళ్లడం వల్లే విరాట్ కోహ్లీ విఫలమయ్యాడని, టీమిండియా ఓడిపోయిందని విమర్శలు ఎక్కుపెట్టారు. నెటిజెన్లు రకరకాల కామెంట్లు చేసి పాపం అనుష్కను ఏడిపించారు. తెలుగు అభిమానులయితే అనుష్కను ఐరన్ లెగ్ అనేశారు.
అదే అనుష్కను ఇప్పుడు లక్కీ లేడీ అంటున్నారు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అనుష్క రూపంలో అదృష్టం కలసివచ్చిందట! ఐపీఎల్లో బెంగళూరు మ్యాచ్లకు వర్షం నేనున్నానంటూ ప్రత్యక్షమైంది. ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్తో ఆడిన చివరి లీగ్ మ్యాచ్కు బెంగళూరుకు కీలకమైనది. ఈ మ్యాచ్ చూసేందుకు అనుష్క స్టేడియానికి వెళ్లింది. ఈ మ్యాచ్లోనూ వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 187/5 భారీ స్కోరు చేసింది. బెంగళూరు లక్ష్యసాధనకు దిగగానే భారీ వర్షం రావడంతో మ్యాచ్ రద్దయ్యింది. ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చారు. ఐపీఎల్-8లో బెంగళూరు మొత్తం 16 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచి నాకౌట్ చేరింది. బెంగళూరుకు ప్లే ఆఫ్ బెర్తు ఖాయంకాగానే కోహ్లీ సంతోషంతో తన ప్రేయసి అనుష్క దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. అనుష్క కూడా ముసిముసి నవ్వులతో ప్రియుడిని అభినందించింది. అనుష్క లక్కీ లేడి అని బెంగళూరు అభిమానులు మురిసిపోతున్నారు.
అనుష్క ఐరన్ లెగ్ కాదు లక్కీ లేడీ..!
Published Mon, May 18 2015 11:58 AM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM
Advertisement
Advertisement