పుణె: త‍్వరలో ఇంగ్లండ్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌లో దాయాది పాకిస్తాన్‌తో భారత క్రికెట్ జట్టు ఆడాలా.. వద్దా అనే నిర్ణయాన్ని కేంద్ర ప‍్రభుత్వానికే వదిలేద్దామని దిగ్గజ బౌలర్ కపిల్ దేవ్ పేర్కొన్నాడు. పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ పాక్ జట్టుతో టీమిండియా ఆడాలా వద్దా అన్న దానిపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో కపిల్ స్పందించారు.
శుక్రవారం పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో కపిల్ దేవ్ ప్రసంగిస్తూ.. ‘పాకిస్తాన్‌తో టీమిండియా ఆడాలా, వద్దా అన్నదానిపై మనలాంటి వాళ్లు నిర్ణయాలు తీసుకోకూడదు. దాన్ని ప్రభుత్వమే నిర్ణయించాలి. దీనిపై మనం అభిప్రాయాలు వెల్లడించడం కాకుండా... ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు వదిలేయాలి. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రయోజనాల కోసమే కదా... కాబట్టి వాళ్లేం కోరుకుంటారో అదే మనం చేద్దాం’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment