భారత్ నుంచి ఆరుగురు | List of T-20 World Cup officials | Sakshi
Sakshi News home page

భారత్ నుంచి ఆరుగురు

Published Fri, Feb 26 2016 12:06 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

List of T-20 World Cup officials

టి20 ప్రపంచకప్ అధికారుల జాబితా

 దుబాయ్: వచ్చే నెలలో జరిగే టి20 ప్రపంచకప్ ప్లేయింగ్ కంట్రోల్ టీమ్‌లో భారత్ నుంచి ఆరుగురికి చోటు దక్కింది. ఓవరాల్‌గా 31 మంది ఉన్న ఈ ప్యానెల్‌లో తొలిసారిగా ఇద్దరు మహిళలకు కూడా చోటు దక్కింది. భారత్ నుంచి శ్రీనాథ్ (రిఫరీ), అనిల్ చౌధరి, వినీత్ కులకర్ణి, సీకే నందన్, షంషుద్దీన్, రవి సుందరం (అంపైర్లు) ఉన్నారు.  ఎలైట్ ప్యానెల్ ఆఫ్ ఐసీసీ మ్యాచ్ రిఫరీస్‌లో ఉన్న ఏడుగురు, ఎలైట్ ప్యానెల్ అంపైర్లలోని 12 మంది, 10 మంది ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ ఐసీసీ అంపైర్స్, ఇద్దరు ఐసీసీ అసోసియేట్స్ అండ్ అఫిలియేట్ ప్యానెల్ అంపైర్లు ఈ టీమ్‌లో ఉన్నట్టు ఐసీసీ పేర్కొంది.

ఈ ప్లేయింగ్ కంట్రోల్ టీమ్‌కు రిఫరీ జవగల్ శ్రీనాథ్ నాయకత్వం వహిం చ నున్నారు. 8న జరిగే ప్రారంభ మ్యాచ్‌కు ఆయన రిఫరీగా వ్యవహరిస్తారు. తొలిసారిగా మహిళా అంపైర్స్‌గా క్యాథలీన్ క్రాస్ (కివీస్), క్లెయిర్ పొలోసక్ (ఆసీస్) విధులు నిర్వర్తించనున్నారు. ఓవరాల్‌గా 24 మంది అంపైర్లలో 12 మందికిదే తొలి టి20 ప్రపంచకప్ కావడం విశేషం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement