ఇటీవల ముగిసిన ఐసీసీ టి20 ప్రపంచకప్‌కు సంబంధించిన మ్యాచ్‌లను అభిమానులు రికార్డు స్థాయిలో వీక్షించారు.
దుబాయ్: ఇటీవల ముగిసిన ఐసీసీ టి20 ప్రపంచకప్‌కు సంబంధించిన మ్యాచ్‌లను అభిమానులు రికార్డు స్థాయిలో వీక్షించారు. భారత్‌లోని ఏడు వేదికల్లో జరిగిన 48 మ్యాచ్‌లను 32 కోట్ల మంది డిజిటల్, సోషల్ మీడియా ద్వారా తిలకించారు. ఇక ఐసీసీ నుంచి ప్రసార హక్కులు తీసుకుని వివిధ దేశాల్లో ప్రసారం చేసిన చానెల్స్ కూడా అత్యధిక వీక్షకులను సంపాదించాయి.
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ స్టార్‌స్పోర్ట్స్, దూరదర్శన్‌లో ప్రసారం కాగా ఇది 17.3 రేటింగ్ సాధించింది. 8 కోట్ల 30 లక్షల మంది అత్యంత ఆసక్తిగా తిలకించారు. 2007 టి20 ప్రపంచకప్ ఫైనల్ అనంతరం ఇదే అత్యధిక స్థాయి కావడం విశేషం. ఓవరాల్‌గా భారత్‌లో ఈ టోర్నీ 73 కోట్ల మందిని ఆకర్శించింది.