ముంబై: మాస్టర్ బ్లాస్టర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జీవితచరిత్ర తెలుసుకునే అవకాశం విద్యార్థులకు త్వరలో లభించనుంది. రాష్ట్ర విద్యాబోర్డు పాఠ్యపుస్తకాల్లో సచిన్‌పై ఓ అధ్యాయం అధ్యాయం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి రాజేంద్రదర్డా పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. సచిన్ భారత క్రికెట్‌ను ప్రపంచ క్రీడాపటంలో నిలిపారన్నారు. దేశంతోపాటు రాష్ర్టం కూడా గర్వించేవిధంగా చేశాడంటూ కొనియాడారు. ఈ నేపథ్యంలో సచిన్ చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీంతో విద్యార్థులుకూడా ఆయన గురించి తెలుసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పాఠ్యాంశంలో అతను సాధించిన విజయాలు, గొప్ప జీవితచరిత్ర తదితర అంశాలను వివరించనున్నారు. అయితే దీనిని ఏ తరగతిలో ఉంచాలనే విషయమై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదన్నారు.
త్వరలో జరగనున్న సమావేశంలో కొత్త పాఠ్యాంశాన్ని ఏ తరగతిలో ప్రారంభించాలి? ఏౌ విషయాలను పొందుపర్చాలనే అంశంపై చర్చిస్తామన్నారు. కాగా మహారాష్ట్ర నవనిర్మాణ్ విద్యార్థి సేన, మహారాష్ట్ర స్టేట్ టీచర్స్ అసోసియేషన్‌లతోపాటు అనేక సంస్థలు సచిన్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా లేఖలు కూడా రాశాయన్నారు.
సచిన్ టెండూల్కర్, ‘, క్రీడాభిమానులు, Sachin Tendulkar, ‘భారతరత్న’, Riket sports fans