విదేశీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని
భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని తొలిసారిగా ఓ విదేశీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. దుబాయ్ కేంద్రంగా హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వ్యవహారాలు నిర్వహించే మిడ్‌వెస్ట్ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఎంత మొత్తం అనేది బయటకు చెప్పకపోయినా... మూడేళ్ల కాలానికి భారీ మొత్తం ఈ కంపెనీ ఇస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించబోయే మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ కూడా ఈ కంపెనీదే. దుబాయ్, బ్రిటన్‌లలో ఈ కంపెనీకి అనేక హోటళ్లు ఉన్నాయి.