లండన్: మరికొద్ది రోజుల్లో సొంతగడ్డపై ఆరంభం కానున్న వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్ జట్టు భారీ మార్పులతో కూడిన జట్టును తాజాగా ప్రకటించింది. ముందనుకున్న ప్రపంచకప్ జట్టులో ఉన్న డేవిడ్ విల్లీ, జో డేన్లీ, అలెక్స్ హేల్స్‌పై వేటు వేశారు. ప్రదర్శన ఆధారంగా విల్లీ, డెన్లీలపై వేటు పడితే, డ్రగ్ టెస్టులో విఫలం కావడంతో అలెక్స్ హేల్స్‌ను జట్టు నుంచి తప్పిస్తూ ఇంగ్లండ్ సెలక్టర్లు నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు మంగళవారం 15 మందితో కూడిన తుది జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. ఈ జట్టులో సెలక్టర్లు అనూహ్యంగా ఆల్ రౌండర్ జోఫ్రా ఆర్చర్‌కు చోటు కల్పించారు. గత నెలలో ఇంగ్లండ్ సెలక్టర్లు ప్రకటించిన ప్రిలిమినరీ జట్టులో జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్ కోసం ఆటగాళ్ల జాబితాను మార్చుకోవడానికి మే 23వ తేదీ వరకు ఆయా క్రికెట్ జట్లకు అవకాశం ఉండటంతో పలు మార్పులు చేసింది ఈసీబీ. ఆర్చర్‌తో పాటు సెలక్టర్లు లియామ్ డాసన్, జేమ్స్ విన్సీలను వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక చేశారు.
వరల్డ్‌కప్ ఇంగ్లండ్ జట్టు ఇదే
ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జోనీ బెయిర్ స్టో, జాసన్ రాయ్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, లియామ్ ప్లంకెట్, ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్, జేమ్స్ విన్సీ, టామ్ కురాన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్
Comments
Please login to add a commentAdd a comment